Election news

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్పై సస్పెన్స్కు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్గఢ్‌, మిజోరాంలతో పాటే తెలంగాణలోనూ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ఓపీ రావత్ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. తెలంగాణలో ఎన్నికల పోలింగ్డిసెంబర్‌ 7 మొత్తం 119 స్థానాలకు ఒకే విడతలోనిర్వహించనున్నట్టు వెల్లడించారు. డిసెంబర్‌ 11 ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. నవంబర్‌ 12 ఎన్నికలకు నోటిఫికేషన్జారీ చేయనున్నటు చెప్పారు.

తెలంగాణ, రాజస్థాన్రాష్ట్రాలకు ఈసీ ప్రకటించిన షెడ్యూల్ విధంగా ఉంది.

నోటిఫికేషన్ విడుదలనవంబర్ 12
నామినేషన్లు దాఖలు చివరి తేద : నవంబర్ 19
నామినేషన్ల పరిశీలననవంబర్ 20
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీనవంబర్ 22
పోలింగ్డిసెంబర్ 7
కౌంటింగ్డిసెంబర్ 11

తెలంగాణలో ఎన్నికల జాబితాకు సంబంధించి కేసు పెండింగ్లో ఉందని ఆయన తెలిపారు. అసెంబ్లీ రద్దైన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, ఓటర్ల తుది జాబితాను ఖరారు కాగానే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామని రావత్వెల్లడించారు. నెల 12 తేదీలోగా ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్విడుదల చేసేందుకు కొంత సమయం పట్టవచ్చునని ఆయన చెప్పారు.

Web site enigneeer- A.Gopal

The Warangal collector prashanth patil, joint collector dayanand  organized a program for how to use evm in elections  telangana in Warangal urban district

In telangana-india